Boo: ఫేస్‌బుక్ లో కోట్లాది ఫాలోవర్స్ ను పొందిన ‘బూ’ పెట్ మృతి

  • 1.66 కోట్ల ఫాలోవర్లను కలిగిన ‘బూ’
  • 2017లో సహచర కుక్క మృతి
  • అప్పటి నుంచి ఆరోగ్యం సరిగా లేదు
ఫేస్‌బుక్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి ‘బూ’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదొక అందమైన కుక్క.. ఫేస్‌బుక్ సంచలనం. ఏకంగా 1.66 కోట్ల ఫాలోవర్లను కలిగిన ‘బూ’ నిన్న మరణించింది. ఈ శునకానికి ఫేస్‌బుక్‌లో ప్రత్యేకంగా ఓ అకౌంట్ ఉంది. ఏ జంతువుకూ లేనంతమంది ఫాలోవర్స్ దీని సొంతం. 2017లో ‘బూ’ సహచర కుక్క మరణించిందట.

అప్పటి నుంచి దాని ఆరోగ్యం సరిగా లేదు. దీంతో ‘బూ’ శుక్రవారం ఉదయం నిద్రలోనే చనిపోయిందని దాని యజమాని ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘బూ’ ఫేస్‌బుక్ ఖాతా తెరిచినప్పటి నుంచి అనేకమంది దానిని ఫాలో అయ్యారని.. వారందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.
Boo
Facebook
Sentsation
Followers
Died

More Telugu News