Adilabad District: అందలం ఎక్కించిన సేవా దృక్పథం... సర్పంచ్‌గా ఆటోవాలా ఏకగ్రీవం

  • గత కొన్నేళ్లుగా గ్రామస్థులకు సాయం
  • కష్టసుఖాల్లో తలలో నాలుకలా వ్యవహరించే తత్వం
  • పంచాయతీ ఎన్నికల్లో ఆయనకే జైకొట్టిన జనం

సాయం ఊరికే పోదంటారు. చిత్తశుద్ధితో సేవలందిస్తే వాటి ప్రతిఫలం ఏదో ఒక రోజు దక్కుతుందన్నది ఓ నమ్మకం. ఆ ఆటోవాలా విషయంలో ఇది నిజమయింది. జీవనోపాధిలోనూ సేవా దృక్పథం ప్రదర్శించి పదిమందికీ అందించిన సాయం ప్రస్తుతం ఆయనను సర్పంచ్‌ స్థానంలో కూర్చోబెట్టింది.

వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలంలోని అందుగూడ, కొత్తగూడ, చింతకర్ర గ్రామాలతో కలిసి అందుగూడ ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. ఈ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ శంకర్‌ (28) గత కొన్నేళ్లుగా ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ఊరి ప్రజల కష్టసుఖాల్లో నేనున్నానంటూ నిలిచే అతని చేదోడు స్వభావం గ్రామస్థులకు దగ్గర చేసింది. అన్ని విషయాల్లోనూ స్థానికులకు తలలో నాలుకలా వ్యవహరించే వాడు. అతని స్వభావం, సేవాగుణం నచ్చిన గ్రామస్థులు ప్రస్తుతం అతన్నే సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

  • Loading...

More Telugu News