Chili: చిలీలో భారీ భూకంపం!
- రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత
- కోక్వింబో నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో కేంద్రం
- వేలాది గృహాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం
చిలీలోని ఉత్తర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని నిర్ధారించిన యూఎస్ జియోలాజికల్ సర్వే, రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో ఇది సంభవించిందని పేర్కొంది. భూమి ఉపరితలానికి 53 కిలోమీటర్ల లోతులో, కోక్వింబో నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో దీని కేంద్రం ఉందని అధికారులు తెలిపారు.
నేటి ఉదయం 6 గంటల సమయంలో (భారత కాలమానం) ఈ భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు రాజధాని శాంటియాగోలోనూ కనిపించాయి. వేలాది గృహాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన నేషనల్ ఎమర్జెన్సీ ఆఫీస్ రంగంలోకి దిగింది. భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలపై ఇంకా వివరాలు అందలేదు.