europe: పల్టీ కొట్టిన అక్రమ వలసదారుల బోట్లు.. మధ్యధరా సముద్రంలో 170 మంది గల్లంతు!
- ఇటలీ తీరం సమీపంలో ఘటన
- లిబియా, మొరాకో బోట్లు పల్టీ
- ప్రాణాలు దక్కించుకున్న ఓ వ్యక్తి
అరబ్, ఆఫ్రికా దేశాల్లో కొనసాగుతున్నఅంతర్యుద్ధం కారణంగా వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా లిబియా, మొరాకో నుంచి అక్రమ వలసదారులను తీసుకొస్తున్న రెండు పడవలు బోల్తా కొట్టడంతో ఏకంగా 170 మంది మధ్యధరా సముద్రంలో గల్లంతయ్యారు. వీరంతా చనిపోయి ఉంటారని ఇటలీ కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి తీరానికి ఈదుకుంటూ వచ్చాడనీ, అతనికి చికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఆఫ్రికా, పశ్చిమాసియా ప్రజలు మెరుగైన జీవితం కోసం యూరప్ దేశాలకు ఇలా అక్రమ మార్గాల్లో వెళుతుంటారు. అయితే చిన్నచిన్న పడవల్లో పరిమితికి మించి ఎక్కడంతో సముద్రంలో అవి బోల్తా పడుతుంటాయి. ఈ తరహాలో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.