Pakistan: పాకిస్తాన్ లో మొసళ్ల పండుగ.. కాల్చిన మాంసం, పిండి వంటలను లాగించేస్తున్న మొసళ్లు!
- కరాచీ సమీపంలో షీది ప్రజల వేడుక
- సూఫీ మాంగోఫిర్ దర్గాలో ప్రత్యేక పూజలు
- గట్టి భద్రత కల్పించిన పాక్ సర్కారు
సాధారణంగా మనలో చాలామంది మొసళ్లను దూరంగా చూస్తేనే భయపడతాం. కానీ పాకిస్తాన్ లోని కరాచీకి సమీపంలో ఉన్న షీది ప్రజలు మాత్రం కాస్త డిఫరెంట్. ఎందుకంటే వీళ్లు మొసళ్లను దైవ సమానంగా భావిస్తారు. ప్రతీ ఏటా మొసళ్ల పండుగ నిర్వహిస్తారు. తొలుత సమీపంలోని సూఫీ మాంగోఫిర్ దర్గాలో పూజలు నిర్వహిస్తారు.
అనంతరం పక్కనే ఉన్న చెరువులో ఉన్న మొసళ్లకు పూలదండలు వేసి కుంకుమ చల్లి పూజలు చేస్తారు. ఆ తర్వాత వేడివేడిగా కాల్చిన మాంసంతో పాటు పిండి వంటలను కూడా పెడతారు. ఈ సందర్భంగా ప్రజలంతా కలిసి సంప్రదాయ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతారు. అయితే ఉగ్రవాదుల హెచ్చరిక, ఇతర భద్రతా కారణాల రీత్యా ఇక్కడ గత ఏడేళ్లుగా వేడుకలను నిలిపివేశారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక అధికారులు కట్టుదిట్టమైన భద్రత కల్పించడంతో ఈ ఏడాది మొసళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు.
మొసలికి పూలదండలేస్తారు. కుంకుమ చల్లుతారు
— BBC News Telugu (@bbcnewstelugu) January 19, 2019
ఇలాంటి పండుగ ఎప్పుడైనా చూశారా?#Wildlife #CrocodileFestival pic.twitter.com/SwvP0j8Oqm