telangana: నిరవధికంగా వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ
- గవర్నర్ ప్రసంగంపై తీర్మానాన్ని ఆమోదించిన సభ
- అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేసిన స్పీకర్
- చర్చ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. అనంతరం తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
అంతకు ముందు ప్రసంగం సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఏకకాలంలో రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని... అయినా ప్రజలు టీఆర్ఎస్ నే నమ్మారని చెప్పారు. ఏకమొత్తంలో చేస్తామని పంజాబ్ లో కూడా కాంగ్రెస్ చెప్పిందని... ఇంతవరకు అది అక్కడ అమలు కాలేదని విమర్శించారు. రైతు రుణమాఫీపై మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఉత్త సంతకాలు మాత్రమే చేశాయని... ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని అన్నారు. రైతు రుణమాఫీని తాము వందకు వంద శాతం చేస్తామని చెప్పారు.