ntr: రాజమౌళి సినిమా కోసం దేశంలో తొలిసారిగా ఉపయోగిస్తోన్న కెమెరా లెన్స్
- కొంతకాలం క్రితమే ఫస్టు షెడ్యూల్ పూర్తి
- ఈ రోజునే మొదలైన సెకండ్ షెడ్యూల్
- ముఖ్యపాత్రలో ప్రియమణి
ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. 'ఆర్ ఆర్ ఆర్' అంటే 'రామ రావణ రాజ్యం' అని చెబుతున్నారు. కొంతకాలం క్రితం తొలి షెడ్యూల్ ను పూర్తిచేసిన ఈ సినిమా టీమ్, ఈ రోజున రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టింది. ఎన్టీఆర్ .. చరణ్ పై భారీ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం భారత్ దేశంలోనే తొలిసారిగా అర్రి అలెక్సా ఎల్ ఎఫ్ .. అర్రి సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ ను ఉపయోగిస్తున్నాము అని ఆయన ట్వీట్ చేశాడు. ఈ లెన్స్ ప్రత్యేకత ఏమిటనేది తెరపై చూడవలసిందే. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికలుగా కీర్తి సురేశ్ .. రష్మిక పేర్లు వినిపిస్తున్నాయి. ఒక ముఖ్యమైన పాత్రలో ప్రియమణి కనిపించనుందని అంటున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.