Andhra Pradesh: విజయవాడలో ‘యురేనియం బాక్సు’ కలకలం.. జనావాసాలకు దూరంగా తీసుకెళ్లిన పోలీసులు!
- నిన్న బాక్సును పట్టుకున్న పోలీసులు
- అందులో యురేనియం, ఇరీడియం ఉందన్న నిందితులు
- రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఓ అనుమానాస్పద బాక్సుతో కలకలం చెలరేగింది. నిన్న ఓ వాహనంలో అనుమానాస్పదంగా తరలిస్తున్న బాక్సును కృష్ణలంక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై డీఆర్ డీవో, అని పేలుడు పదార్థం అని రాసి ఉండటంతో అధికారులు డీఆర్ డీవో శాస్త్రవేత్తలకు సమాచారం అందించారు.
మరోవైపు తాము రూ.5 లక్షలు ఇచ్చి ఈ బాక్సును కొనుగోలు చేశామని ఇద్దరు నిందితులు విచారణలో తెలిపారు. చాలా విలువైన వస్తువు ఇందులో ఉందనీ, సొంత మనుషులే తమను పోలీసులకు పట్టించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాక్సులో యురేనియం, ఇరీడియం అనే రేడియో ధార్మిక పదార్థాలు ఉన్నాయని నిందితులు చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
డీఆర్ డీవో శాస్త్రవేత్తల సూచన మేరకు బాక్సును జనావాసాలకు దూరంగా ఉన్న మంగళగిరి లోని పోలీస్ క్యాంప్ కు తరలించారు. కాగా, ఈ బాక్సును తెరిచేందుకు అధికారులు బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించారు.