madhavan: డిఫరెంట్ లుక్ తో షాక్ ఇస్తోన్న మాధవన్!

  • నంబి నారాయణ్ పాత్రలో మాధవన్
  • కీలకమైన పాత్రలో సిమ్రాన్
  •  వివిధ భాషల్లో విడుదల  

విలక్షణ కథానాయకుడిగా మాధవన్ కి మంచి పేరుంది. ఆయన తాజా చిత్రంగా 'రాకెట్రి ది నంబి ఎఫెక్ట్' అనే సినిమా రూపొందుతోంది. ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ కథ ఆధారంగా ఈ బయోపిక్ నిర్మితమవుతోంది. నంబి నారాయణ్ పాత్రలో మాధవన్ నటిస్తుండగా .. మరో కీలకమైన పాత్రలో సిమ్రాన్ కనిపించనుంది. ఈ సినిమాలో నంబి నారాయణ్ మాదిరిగా కనిపించడానికి మాధవన్ ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు.

ఆ పాత్రను ఆయన ఎంత అంకితభావంతో చేస్తున్నాడనేది అందుకు సంబంధించిన ఫోటోలు చూస్తే తెలిసిపోతుంది. ఆ ఫోటోలు చూస్తే ఎవరు అసలు నంబి నారాయణ్ అనేది పోల్చుకోవడం కష్టం అనేంతగా మాధవన్ శ్రద్ధ పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా కోసం దర్శకుడిగా రంగంలోకి దిగిన అనంత్ మహదేవన్ కొన్ని కారణాల వలన పక్కకి తప్పుకోవడంతో, దర్శకత్వ బాధ్యతలను మాధవన్ తన భుజాలపై వేసుకున్నాడు. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

  • Loading...

More Telugu News