Newzeland: 18 పరుగులకే 2 వికెట్లు... గప్టిల్, మున్రోలను పెవిలియన్ చేర్చిన షమీ!
- న్యూజిలాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ
- వికెట్ల ముందు దొరికిపోయిన ఓపెనర్ గుప్టిల్
- న్యూజిలాండ్ స్కోరు 4 ఓవర్లలో 18/2
సొంత గడ్డపై ఇండియాతో తొలి వన్డే ఆడుతున్న న్యూజిలాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆట రెండో ఓవర్ లో 5 పరుగులు చేసిన ఓపెనర్ ఎంజే గుప్టిల్ ను భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే 18 పరుగుల స్కోరు వద్ద రెండు ఫోర్లు చేసి దూకుడు మీదున్న సీ మున్రోను బుమ్రానే మరో అద్భుత బాల్ తో అవుట్ చేశాడు.
షమీ వేసిన బాల్ ను సరిగ్గా అంచనా వేయలేకపోయిన గప్టిల్, మున్రోలు వికెట్ల ముందు దొరికిపోయారు. దీంతో న్యూజిలాండ్ రెండు వికెట్లను కోల్పోయింది. బ్యాటింగ్ కు అనుకూలించే ఈ పిచ్ పై తొలుత బ్యాటింగ్ చేసే జట్టు 300 పరుగులకు పైగానే సాధించినా, దాన్ని ఛేదించవచ్చని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు నాలుగు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 18 పరుగులు. కేన్ విలియమ్సన్ 5 పరుగులతో, ఆడుతుండగా, రాస్ టేలర్ అతనికి జతగా వచ్చి చేరాడు.