Andhra Pradesh: జలీల్ ఖానే అలా చెప్పుకుంటున్నారు.. చంద్రబాబు ఆమె పేరును ప్రకటించలేదు: ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా
- మమ్మల్ని సంప్రదించకుండా బాబు ఆ పనిచేయరు
- జలీల్ ఖాన్ చెబుతున్న దాంట్లో వాస్తవం లేదు
- నేడు సీఎంను కలుస్తాం
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా జలీల్ ఖాన్ కుమార్తె షబానా పేరును చంద్రబాబు ప్రకటించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా అన్నారు. ఈ నియోజకవర్గంలో తమ వర్గీయులు ఎక్కువమంది ఉన్నారని, తమను సంప్రదించకుండా చంద్రబాబు అభ్యర్థిని ప్రకటిస్తారని తాము అనుకోవడం లేదన్నారు. చంద్రబాబు తమ కుమార్తె పేరును ప్రకటించినట్టు జలీల్ ఖానే చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని చంద్రబాబు వద్దే తేల్చుకుంటామని, నేడు ఆయనను కలుస్తామని నాగుల్ మీరా చెప్పారు.