Hyderabad: పేషెంట్ పట్ల అసభ్య ప్రవర్తన.. ల్యాబ్ టెక్నీషియన్ అరెస్ట్

  • హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీలో ఘటన
  • తాకరాని చోట తాకిన టెక్నీషియన్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి 
అనారోగ్యంతో ఉన్న యువతిని వైద్య పరీక్షలు చేయించుకుని రావాలని వైద్యుడు చెబితే, ఆయన సూచన మేరకు ఓ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ కు వెళ్లగా, టెక్నీషియన్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. నగరంలోని గోల్కొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి (22) విజయనగర్‌ కాలనీలో ఉన్న విజయా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ కు సిటీ స్కానింగ్‌ నిమిత్తం వెళ్లగా, అక్కడ టెక్నీషియన్ గా పని చేస్తున్న ఓ యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తాకకూడని చోట తాకాడు. దీనిపై బాధితురాలు హుమయూన్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. నిందితుడిని అరెస్ట్ చేశామని, ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Hyderabad
Police
Vijaya Diagnostic Centrer
Lady
Harrasment

More Telugu News