Jagan: జగన్ పై దాడి కేసు.. ముగిసిన శ్రీనివాసరావు రిమాండ్.. కోర్టుకు తరలింపు!
- ఇప్పటికే చార్జిషీట్ దాఖలుచేసిన ఎన్ఐఏ
- జగన్ పై దాడికేసులో క్లారిటీ వచ్చే ఛాన్స్
- గతేడాది అక్టోబర్ 25న దాడిచేసిన నిందితుడు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై దాడి కేసులో శ్రీనివాసరావు ఎన్ఐఏ కస్టడీ ముగిసింది. ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాసరావును అధికారులు ఈరోజు విజయవాడలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. జగన్ పై అతను కావాలనే దాడి చేశాడా? లేక ఈ దాడి వెనుక మరెవరైనా ఉన్నారా? అన్న విషయంలో ఈరోజు స్పష్టత రానుంది.
మరోవైపు ఈ కేసులో ఎన్ఐఏ, సిట్ అధికారుల మధ్య వివాదం తేలేవరకూ విచారణను నిలిపివేయాలని నిందితుడి తరఫు న్యాయవాది సలీం కోర్టును కోరారు. గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు కోడికత్తితో జగన్ పై దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎడమ చేతికి లోతైన గాయం కావడంతో జగన్ హైదరాబాద్ లో చికిత్స చేయించుకున్నారు.