kangana: వీరనారిగా కంగనా విశ్వరూపం చూపింది: 'మణికర్ణిక' గురించి బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్
- ఈ రోజే థియేటర్లకు వచ్చిన 'మణికర్ణిక'
- కంగనా నటన అద్భుతం
- ఉత్తేజాన్ని నింపే ఆదర్శవంతమైన చిత్రం
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్రగా హిందీలో 'మణికర్ణిక' చిత్రం రూపొందింది. కంగనా రనౌత్ ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించింది. క్రిష్ .. కంగనా దర్శకత్వంలో భారీ చిత్రంగా ఇది నిర్మితమైంది. దేశభక్తి నేపథ్యంలో సాగే కథ కావడంతో రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను ఈ రోజున విడుదల చేశారు. హిందీలో అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఈ సినిమా చూసి తనదైన శైలిలో స్పందించారు. " ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చాలా పవర్ఫుల్ మూవీ. అందరిలోనూ ఉత్తేజాన్ని నింపే ఆదర్శవంతమైన చిత్రం. ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కంగనా అద్భుతంగా నటించింది. దేశభక్తిని .. ఝాన్సీ లక్ష్మీబాయి శక్తిని అద్భుతంగా చూపించారు. క్లైమాక్స్ చాలా బాగుంది" అని అన్నారు.
ఇక ఈ సినిమా చూసిన అక్కడి ప్రేక్షకులు ..ఝాన్సీ లక్ష్మీబాయి తెరపైకి వచ్చిందా అన్నంత సహజంగా కంగనా నటించింది .. ఈ సినిమా ఆమె కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచిపోవడం ఖాయం' అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.