hemang veloor: పద్నాలుగేళ్ల కుర్రాడు... పెద్దోళ్ల సరసన చేరాడు

  • యంగ్‌ సీఈఓ హేమాంగ్‌ వేలూర్‌ ఘనత ఇది
  • వరంగల్‌ బిట్స్‌ టెడెక్స్‌ సదస్సులో ప్రత్యేక ఆకర్షణ
  • స్పూర్తిదాయక ప్రసంగంతో ఆకట్టుకున్న వైనం

జస్ట్ పద్నాలుగేళ్ల వయసులో 'యంగ్ సీఈఓ' అనే కంపెనీని స్థాపించడమే కాకుండా, తన ప్రతిభా సామర్థ్యంతో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న కుర్రాడు హేమాంగ్‌ వేలూర్‌. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నెపల్లిలోని బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (బిట్స్‌)లో జరిగిన టెడెక్స్‌ సదస్సులో ఈ చిన్నారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.  

దేశ విదేశాలకు చెందిన దాదాపు 17 కంపెనీల సీఈఓలు, వాణిజ్యవేత్తలు, నిపుణులు హాజరైన ఈ సదస్సులో హేమాంగ్‌ ‘గెట్టింగ్‌ యంగ్‌ ఇన్నోవేషన్స్‌’ అనే అంశంపై మాట్లాడి ఆకట్టుకున్నాడు. తన కంటే పెద్దవాళ్ల ముందు ప్రసంగిస్తూ పలు అంశాలను వివరించి వారిలో స్ఫూర్తి నింపాడు. సభికుల మన్ననలు సొంతం చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News