Jaiswal: చేతిలో జాతీయ పతాకం పట్టుకుని.. 80.5 కి.మీ. పరుగు!
- శుక్రవారం రాత్రి 8 గంటలకు పరుగు ప్రారంభం
- నేటి ఉదయం 9 గంటల వరకూ సాగింది
- ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు
ఏ కార్యాన్నైనా కొంతమంది వినూత్నంగా చేయడానికి ప్రయత్నిస్తారు. నాగపూర్‌కి చెందిన 55 ఏళ్ల జైశ్వాల్ కూడా అలాంటి వ్యక్తే. అందుకే, మధ్యలో విరామం అన్నది తీసుకోకుండా ఏకబిగిన 80.5 కిలోమీటర్లు పరుగుపెట్టి రికార్డు సృష్టించాడు. నేడు 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జైశ్వాల్ చేతిలో త్రివర్ణ పతాకంతో 12 గంటలకు పైగా మారథాన్ రన్ చేసి దేశ ప్రజలను తనవైపు తిప్పుకున్నాడు.
శుక్రవారం రాత్రి 8 గంటలకు చేతిలో త్రివర్ణ పతాకంతో ప్రారంభమైన జైశ్వాల్ పరుగు విరామం అన్నది లేకుండా నేటి ఉదయం 9 గంటల వరకూ కొనసాగింది. మొత్తంగా 80.5 కిలో మీటర్లు పరిగెత్తి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సూపర్‌వైజర్ సునీతా ధోటే ఈ రికార్డును ధ్రువీకరించారు. ఈ సందర్భంగా జైశ్వాల్ మాట్లాడుతూ.. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి తన పేరు రిపబ్లిక్ డే నాడు ఎక్కడం అన్నది అదృష్టంగా భావిస్తున్నానన్నాడు. తనకు దక్కిన ఈ గౌరవాన్ని సరిహద్దుల్లో పోరాడుతున్న భారత సైనికులకు అంకితమిస్తున్నట్టు తెలిపారు.