chanda kochhar: చందాకొచ్చర్పై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారి ఒక్క రోజులోనే బదిలీ!
- నిబంధనలను ఉల్లంఘించి వీడియోకాన్ కు లోన్ మంజూరు
- ఆరోపణల నేపథ్యంలో పదవి నుంచి వైదొలగిన చందా కొచ్చర్
- తాజాగా సీబీఐ కేసు నమోదు
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ అధికారి బదిలీ సుధాన్షు ధార్ మిశ్రా అయ్యారు. కేసు నమోదైన మరుసటి రోజే ఈ పరిణామం సంభవించడం గమనార్హం.
చందాకొచ్చర్ సీఈవోగా ఉన్న సమయంలో ఆమె అధ్యక్షతన గల కమిటీ వీడియోకాన్ కు రూ. 3,250 కోట్లు లోన్ ను మంజూరు చేసింది. లోన్ మంజూరు అయిన రోజుల వ్యవధిలోనే వీడియోకాన్ అధినేత వేణుగోపాల్.. దీపక్ కొచ్చర్ కు చెందిన సంస్థలో రూ. 64 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఈ అంశం వెలుగు చూడటంతో... కొన్ని రోజుల తర్వాత చందా కొచ్చర్ తన పదవి నుంచి వైదొలిగారు. ఇది అవినీతి కిందకే వస్తుందని తాజాగా వారిపై కేసు నమోదైంది. అయితే, ఊహించని విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారి ఒక్క రోజు వ్యవధిలోనే బదిలీ అయ్యారు.