anasuya: టాలీవుడ్ దర్శకుడికి జోడీగా అనసూయ

  • ఓ రొమాంటిక్ చిత్రాన్ని నిర్మిస్తున్న విజయ్ దేవరకొండ
  • తనను హీరోగా పరిచయం చేసిన తరుణ్ భాస్కర్ ను హీరో చేస్తున్న విజయ్
  • అనసూయ జోడీ అయితే బాగుంటుందనే ఆలోచనలో యూనిట్ సభ్యులు
టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తో హాట్ యాంకర్ అనసూయ రొమాన్స్ చేయబోతోంది. వివరాల్లోకి వెళ్తే, సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ చిత్రం నాలుగు క్యారెక్టర్ల మధ్య కొనసాగుతుంది. తనను హీరోగా పరిచయం చేసిన తరుణ్ భాస్కర్ ను ఈ చిత్రంలో హీరోగా విజయ్ పరిచయం చేయబోతున్నాడు. తరుణ్ కు జోడీగా అనసూయ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ విజయ్ కు చెప్పడంతో... ఆయన కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా  వర్కవుట్ అవుతుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. 
anasuya
vijay devarakonda
tarun bhaskar
tollywood

More Telugu News