Cricket: న్యూజిలాండ్ తో మూడో వన్డే.. తొలి వికెట్ కోల్పోయిన భారత్!
- 23 ఓవర్లకు 118 పరుగులు
- హాఫ్ సెంచరీ కొట్టిన రోహిత్
- వికెట్ దక్కించుకున్న బౌల్ట్
న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత క్రికెట్ జట్టు స్థిరంగా ఆడుతోంది. కివీస్ జట్టు నిర్దేశించిన 243 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తొలి వికెట్ ను కోల్పోయింది. న్యూజిలాండ్ సీమర్ బౌల్ట్ వేసిన బంతిని బలంగా బాదేందుకు యత్నించిన శిఖర్ ధావన్(28) టేలర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 39 పరుగులకే తొలి వికెట్ ను కోల్పోయింది.
ఈ నేపథ్యంలో క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం 23 ఓవర్లు ముగిసేనాటికి భారత్ ఓ వికెట్ నష్టపోయి 118 పరుగులు చేసింది. రోహిత్(51), విరాట్ కోహ్లీ(37) పరుగులతో ప్రస్తుతం క్రీజులో కొనసాగుతున్నారు. రాస్ టేలర్(93), టాప్ లాథమ్ (51) బ్యాట్ ఝుళిపించడంతో న్యూజిలాండ్ 242 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.