Andhra Pradesh: పుల్లారావు గారిని జనసేనలో చేరేలా ఒప్పించా.. ఆయన కోసం ఎదురుచూస్తున్నా!: పవన్ కల్యాణ్
- ఆయన కథనాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి
- జనసేనకు ఇలాంటి అనుభవజ్ఞులు అవసరం
- ట్విట్టర్ లో స్పందించిన జనసేనాని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రముఖ ఆర్థికవేత్త, పర్యావరణ ఉద్యమకారుడు పెంటపాటి పుల్లరావుపై ప్రశంసలు కురిపించారు. ఆయన్ను జనసేన పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలిపారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన రాస్తున్న కథనాలు విశ్లేషణాత్మకంగా, ఆలోచింపజేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఓసారి తాను పుల్లారావును కలుసుకున్నాననీ, తామిద్దరం కొన్ని గంటల పాటు ఒకరి ఆలోచనలను మరొకరం పంచుకున్నామని వెల్లడించారు. జనసేన లాంటి కొత్త పార్టీకి పుల్లారావు లాంటి అనుభవం ఉన్న వ్యక్తుల మార్గదర్శకత్వం అవసరముందని అన్నారు. జనసేనలో చేరాల్సిందిగా తాను పుల్లారావును ఒప్పించాననీ, ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన పవన్ కల్యాణ్.. జనసేన విధానాలపై పుల్లారావు రాసిన ఓ వార్తా కథనం క్లిప్ ను ట్వీట్ కు జతచేశారు.
Sri Pentapati Pulla Rao garu, an eminent economist, environmentalist & he’s also known as a senior political analyst for his insightful articles about contemporary politics. pic.twitter.com/cN2nzMZ9O6
— Pawan Kalyan (@PawanKalyan) January 28, 2019