subhashini: మనసులో ఏదుంటే అది మాట్లాడేస్తాను: సీనియర్ నటి సుభాషిణి

  • జయసుధ ధోరణి వేరు 
  • తాను ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు
  • నేను మాట్లాడటం మొదలుపెడితే ఆగను    

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో కలుపుకుని సుభాషిణి దాదాపు 100 సినిమాల్లో నటించారు. అలాంటి సుభాషిణి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తనకి సంబంధించిన విషయాలను గురించి మాట్లాడారు. "ఇతరులతో వ్యవహరించే తీరులో నాకు .. జయసుధకు చాలా తేడా వుంది. జయసుధ చాలా సాఫ్ట్ .. సెట్ కి వచ్చిన తరువాత ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు.

ఏదైనా ఒక పుస్తకం చదువుతూ వుంటుంది .. ఎవరైనా పలకరిస్తే మాట్లాడుతుంది. ఏదైనా ఒక టాపిక్ వస్తే .. దాని గురించి మాట్లాడుతుంది. ఆయా విషయాలపట్ల తన అభిప్రాయాలు చెబుతూ ఉండేది. అంతేగాని తనంతట తానుగా వెళ్లి అనవసరంగా ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఇక నా విషయానికొస్తే .. మాట్లాడటం మొదలుపెట్టానంటే నాన్ స్టాప్ గా మాట్లాడేస్తూనే వుంటాను. నేను మాట్లాడేది కరెక్టా .. కాదా? అనేది నాకు తెలియదు. నా మాటలు అవతలవారిని హర్ట్ చేస్తున్నాయేమోననే ఆలోచన నాకు ఉండదు. మనసులో దాచుకోవడమనేది మనకి అసలు అలవాటే లేదు" అని ఆమె చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News