sensex: అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- బలహీనంగా ట్రేడ్ అవుతున్న అంతర్జాతీయ మార్కెట్లు
- 64 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 10,652 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లన్నీ బలహీనంగా ట్రేడ్ అయ్యాయి. వీటి ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. ఈరోజు మార్కెట్లు ఆద్యంతం ఒడిదుడుకులతోనే కొనసాగాయి. చివరకు సెన్సెక్స్ 64 పాయింట్లు నష్టపోయి 35,592కి పడిపోయింది. నిఫ్టీ 9 పాయింట్లు కోల్పోయి 10,652 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ తదితర కంపెనీలు లాభాలను ఆర్జించాయి. యస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, కొటక్ మహీంద్రా బ్యాంక్ తదితర కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.