Vishakhapatnam: విశాఖలో ఉత్పత్తిని ప్రారంభించిన ఏషియన్ పెయింట్స్

  • ఏషియన్ ప్లాంట్లలోనే అత్యాధునికమైనది
  • 5 లక్షల కిలో లీటర్ల పెయింట్ ఉత్పత్తి
  • రూ.1750 కోట్ల వ్యయంతో ఏర్పాటు

పెయింట్ల తయారీలో దేశంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఏషియన్ పెయింట్స్.. విశాఖపట్టణంలో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా 25కి పైగా ఉన్న ఏషియన్ ప్లాంట్లలో ఇది అత్యాధునికమైన అతిపెద్ద ప్లాంట్. ఏడాదికి 5 లక్షల కిలో లీటర్ల పెయింట్ ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో ఇది నడుస్తుంది.

2015లో కుదిరిన ఎంఓయూ ప్రకారం ఏషియన్ పెయింట్స్ రూ.1750 కోట్ల వ్యయంతో ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసింది. పూడి గ్రామంలో 110 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఏషియన్ పెయింట్స్ ప్లాంట్ ద్వారా 700 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ ప్లాంట్ నుంచి ఏడాదికి 5 లక్షల కిలో లీటర్ల పెయింట్ ఉత్పత్తి చేయగలదు. 

  • Loading...

More Telugu News