Allu Arjun: త్రివిక్రమ్ సినిమా కోసం బరువు తగ్గనున్న బన్నీ
- త్రివిక్రమ్ తో బన్నీ మూవీ
- వచ్చేనెలలో సినిమా లాంచ్
- మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్
కథ .. కథనాల విషయంలో బన్నీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో, తన లుక్ విషయంలోను అంతే శ్రద్ధ తీసుకుంటాడు. ప్రతి సినిమాలోను కొత్తగా కనిపించడానికి .. తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అలాగే 'నా పేరు సూర్య' సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో త్రివిక్రమ్ తో సెట్స్ పైకి వెళ్లడానికి బన్నీ రెడీ అవుతున్నాడు.
'నా పేరు సూర్య' తరువాత బన్నీ గ్యాప్ తీసుకోవడం వలన కాస్త బరువు పెరిగాడట. దాంతో బరువు తగ్గమని త్రివిక్రమ్ చెప్పడంతో, జిమ్ లో గట్టి కసరత్తులే చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చేనెలలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నారు. ఆ లోగా బన్నీ బరువు తగ్గించుకుంటాడన్న మాట. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని పేరు కాస్త గట్టిగానే వినిపిస్తోంది మరి.