Bittiri Satti: బిత్తిరి సత్తిలో ఈ టాలెంట్ కూడా ఉందా?... అదుర్స్ అంటూ చప్పట్లు!
- టీవీ చానళ్లలో, సినిమాల్లో పాప్యులర్ అయిన బిత్తిరి సత్తి
- 'దిక్సూచి' సినిమాలో పాట పాడిన యాంకర్
- వైరల్ అవుతున్న వీడియో
తెలంగాణ యాసలో తనదైన శైలిలో టీవీ చానళ్లలో, సినిమాల్లో పాప్యులర్ అయిన బిత్తిరి సత్తిలో పాటలు పాడే టాలెంట్ కూడా ఉందండోయ్. తాజాగా జరిగిన 'దిక్సూచి' ఆడియో ఆవిష్కరణలో పాల్గొని, సినిమాలో తాను ఆలపించిన ఓ పాటను పాడిన బిత్తిరి సత్తి, ఆహూతులతో అదుర్స్ అనిపించాడు.
పద్మనావ్ భరధ్వాజ్ రచించిన పాటకు రాచూరి నరసింహ రాజు స్వరకల్పన చేయగా, బిత్తిరి సత్తి పాడాడు. "మట్టిలోన మట్టిరా దేహమన్నది... వీర్యము కణమై కడుపున పడుతూ, నెలనెల ఎదిగిన ఓ శిశువా... తనువే తొడిగి, భువిలో పడుతూ తెలియని పుట్టుక నీదికదా.. పూర్వజన్మాల స్మృతిని, మరిచిపోయావు మానవా... మాయనిన్నావరించి, నడక నేర్చావు మెల్లగా..." అంటూ సాగే పాటను సత్తి అద్భుత రీతిలో ఆలపించి, తనలో మరో నైపుణ్యం కూడా ఉందని నిరూపించాడు. బిత్తిరి సత్తి పాట పాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.