Andhra Pradesh: జనసేనలో చేరాలని పవన్ నన్ను పిలవలేదు.. మంత్రి పదవి ఇస్తే ఏ పార్టీలో అయినా చేరుతా!: కమెడియన్ అలీ

  • పవన్ పార్టీ పెడుతున్నారని ముందుగానే తెలుసు
  • ఆయన చెప్పలేదు-నేను అడగలేదు
  • సొంత మనుషుల్ని పవన్ ఇబ్బంది పెట్టరు

టాలీవుడ్ కమెడియన్ అలీ హీరో పవన్ కల్యాణ్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అయినా జనసేన పార్టీని పవన్ పెట్టినప్పటికీ అలీ అందులో చేరలేదు. ఈ విషయమై ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా యాంకర్ ‘పవన్ కల్యాణ్ అడిగితేనే జనసేనలోకి వెళతారా? మంత్రి పదవి ఆఫర్ చేయకపోవడం వల్లే వెళ్లడం లేదా?’ అని అలీని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు అలీ వెంటనే స్పందిస్తూ..‘నా పార్టీలోకి రా అలీ.. అని పవన్ కల్యాణ్ నన్ను పిలవలేదు. పవన్ పార్టీ పెడుతున్నారన్న విషయం నాకు ముందుగానే తెలుసు. అయితే ఈ విషయాన్ని పవన్ నాతో నేరుగా ఎన్నడూ చెప్పలేదు. పవన్ జనసేనను స్థాపించిన తర్వాత ఆయన్ను కలుసుకోలేదు. పార్టీ పెట్టాక ‘నువ్వు జనసేనలోకి రా.. నాకు హెల్ప్ చేయ్. పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొను’ అని పవన్ కోరలేదు. ఆయన వల్ల నాకు ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచనతోనే పవన్ అలా వ్యవహరించి ఉండొచ్చు. తన సొంత మనుషులను ఆయన ఎన్నడూ ఇబ్బంది పెట్టరు. అందుకే నేను వెళ్లలేదు’ అని జవాబిచ్చారు.

తాను టీడీపీలో ఉన్నట్లు పవన్ కు తెలుసనీ, గతంలో ఎన్నికల సందర్భంగా ‘ఎన్నికలు వస్తున్నాయి కదా.. టికెట్ ఇస్తారా నీకు? పోటీ చేస్తున్నావా?’ అని తనను అడిగారని  గుర్తుచేసుకున్నారు. ఏ పార్టీ తనకు మంత్రి పదవిని ఆఫర్ చేస్తే దానిలో చేరుతానని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News