TRS: హరీశ్ రావు సంచలన నిర్ణయం.. టీఎంయూ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా

  • టీఎంయూ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న హరీశ్
  • ఉద్యమంలో కార్మికులను ముందుండి నడిపించిన నేత
  • హఠాత్తు నిర్ణయంపై కార్మికుల్లో చర్చలు

టీఆర్ఎస్ అగ్రనేత, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డికి రాజీనామా లేఖను పంపించారు. హఠాత్తుగా తన నిర్ణయాన్ని ప్రకటించిన హరీశ్ రావు.. టీఎంయూ కార్యక్రమాలకు సమయం కేటాయించలేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ నుంచి వేరుపడి తెలంగాణ మజ్దూర్ యూనియన్‌గా ఏర్పడినప్పటి నుంచి ఆ సంఘానికి హరీశ్ రావు గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు.

ఆర్టీసీ కార్మికులను ముందుండి నడిపించడంలో హరీశ్ రావు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు హఠాత్తుగా ఆయన తన రాజీనామాను ప్రకటించడం కార్మికుల్లో చర్చనీయాంశమైంది. త్వరలో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. దానికీ, హరీశ్ రాజీనామాకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News