Union Budget 2019-20: సీల్డ్ బస్తాల్లో పార్లమెంట్ కు చేరిన బడ్జెట్ ప్రతులు!
- కట్టుదిట్టమైన భద్రత మధ్య పార్లమెంట్ కు
- గతనెల మూడో వారం నుంచి ముద్రణ
- 11 గంటలకు ప్రారంభం కానున్న పీయుష్ ప్రసంగం
2019-20 సంవత్సరానికిగాను కేంద్రం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ ప్రతులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పార్లమెంట్ కు కొద్దిసేపటి క్రితం చేరుకున్నాయి. సీల్ చేసిన బస్తాల్లో వీటిని అధికారులు పార్లమెంట్ కు చేర్చారు. గత నెల మూడోవారంలో పార్లమెంట్ నార్త్ బ్లాక్ లో జరిగిన హల్వా వేడుక తరువాత బడ్జెట్ ముద్రణ అత్యంత రహస్యంగా జరిగిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి ఈ బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్ కు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా సమర్పిస్తారని వార్తలు వచ్చినా, ఆయన అమెరికాలో వైద్య చికిత్స చేయించుకుంటూ ఉండటం, ఇప్పట్లో ప్రయాణాలు వద్దని వైద్యులు సూచించడంతో, ఆ బాధ్యతను కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ తీసుకున్నారు. మరికాసేపట్లో పీయుష్ గోయల్ పార్లమెంట్ కు రానుండగా, ఉదయం 11 గంటలకు ఆయన బడ్జెట్ ప్రసంగం ప్రారంభంకానుంది.