Jana Reddy: ఆడపడుచులతో ‘జనసేన’ కమిటీల ఏర్పాటు
- వీర మహిళ విభాగంతో పాటు పలు కమిటీల్లో మహిళలు
- తొలి జాబితా విడుదల
- పదవులు పొందిన వారిలో నవ వయస్కులు, విద్యాధికులు..
జనసేన పార్టీ కమిటీలకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రూపకల్పన చేశారు. పార్టీ కేంద్ర కమిటీతో పాటు ప్రెసిడెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డివిజన్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో అనేక ప్రజోపయోగ కౌన్సిల్స్, కమిటీలను ఏర్పాటు చేశారు.
వీటిలో సుమారుగా 22 కమిటీలలో మహిళలకు తొలి విడతగా చోటు కల్పించారు. ప్రస్తుతం పదవులు పొందిన వారంతా నవ వయస్కులు, విద్యాధికులు, డాక్టర్లు, లెక్చరర్లు, న్యాయవాదులు, ఐ.టి.నిపుణులతోపాటు గృహిణిలు కూడా వీరిలో వున్నట్టు పేర్కొంది. తమ కెరీర్ ను వదులుకుని ప్రజా సేవ కోసం వచ్చిన ఆడపడుచులు ఎందరో వీరిలో ఉన్నారని, ఇది తొలి జాబితా మాత్రమేనని తెలిపింది. వీర మహిళ (విమెన్ వింగ్) విభాగంతో పాటు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, పార్లమెంటరీ వర్కింగ్ కమిటీ, పార్టీ క్రమశిక్షణా కమిటీ, ప్రొటోకాల్స్ కమిటీ, సెంట్రల్ ఆఫీస్ గ్రీవెన్స్ కమిటీ వంటి వివిధ కమిటీల్లో మహిళలకు స్థానం కల్పించినట్టు పేర్కొంది.
వీర మహిళా విభాగం ఛైర్మన్ గా జవ్వాజి రేఖ
వీర మహిళా విభాగం ఛైర్మన్ గా కర్నూలుకు చెందిన జవ్వాజి రేఖను నియమించినట్టు ‘జనసేన’ పేర్కొంది. వైస్ చైర్మన్లుగా భీమవరానికి చెందిన సింధూరి కవిత , షేక్ జరీనా, నూతాటి ప్రియా సౌజన్య, జి.శ్రీవాణి నియమితులైనట్టు తెలిపారు.