ap: హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన
- భూమి పూజ నిర్వహించిన రంజగ్ గొగోయ్
- ముఖ్యమంత్రి సహా పలువురు న్యాయమూర్తుల హాజరు
- 450 ఎకరాల్లో రూ. 820 కోట్లతో హైకోర్టు నిర్మాణం
ఏపీ హైకోర్టు శాశ్వత నిర్మాణానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అమరావతిలో నిర్మించనున్న హైకోర్టుకు భూమి పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావు, ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు. బౌద్ధ స్తూపాకృతిలో హైకోర్టు శాశ్వత భవనాన్ని నిర్మించనున్నారు. 450 ఎకరాల్లో రూ. 820 కోట్ల ఖర్చుతో 12.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరగనుంది.