YS Sharmila: జగన్ సోదరి షర్మిలపై దుష్ప్రచారం కేసులో మరో యువకుడి అరెస్ట్
- వరుసగా రెండు రోజుల్లో రెండు అరెస్ట్‌లు
- వివిధ సెక్షన్ల కింద కేసుల నమోదు
- ఓ నిందితుడు చంచల్‌గూడ జైలుకు తరలింపు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం కేసులో మరో యువకుడు అరెస్టయ్యాడు. మంచిర్యాల జిల్లా రామనగర్‌కు చెందిన నవీన్‌ను ఆదివారం సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి హైదరాబాద్‌కు తరలించారు.
ఈ కేసులో ఎంసీఏ చదువుతున్న ప్రకాశం జిల్లా చోడవరానికి చెందిన పెద్దిశెట్టి వెంకటేశ్వరరావును ఇప్పటికే అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. షర్మిలకు, నటుడు ప్రభాస్‌కు మధ్య సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగ్గా షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు షర్మిలపై దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లను గుర్తించి నోటీసులు పంపారు. తాజాగా అరెస్టులు మొదలుపెట్టారు.