nagababu: ఆడపిల్లలు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు?: నాగబాబు ఫైర్
- డ్రెస్సింగ్ అనేది ఆడపిల్లల ఇష్టం
- అత్యాచారాలకి అదొక్కటే కారణం కాదు
- పాత సంప్రదాయాలు పట్టుకుని వేళ్లాడుతున్నారు
ఆడపిల్లల డ్రెస్సింగ్ విషయంపై కొంతమంది ప్రముఖులు స్పందించిన తీరుపై, 'మై ఛానల్ నా ఇష్టం' ద్వారా నాగబాబు ప్రతిస్పందించారు. "ఈ మధ్య గౌరవనీయులైన కొంతమంది వ్యక్తులు ఆడవాళ్ల డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు. ఆడవాళ్లు సంప్రదాయ బద్ధమైన వస్త్రాలను ధరించాలని వాళ్లు చెప్పారు. అలాంటి వస్త్రధారణ లేకపోవడం వల్లనే అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఆడవాళ్లు శరీరాన్ని పూర్తిగా కప్పివుంచే వస్త్రాలను ధరించాలని చెప్పారు.
అసలు ఆడపిల్లలు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? అని నేను అడుగుతున్నాను. వంటిని పూర్తిగా కప్పివుంచే వస్త్రాలను ధరించినవారిపై కూడా అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. ఎలాంటి డ్రెస్ లు వేసుకోవాలనేది ఆడపిల్లల హక్కు .. దానిని కాదనడానికి మీరెవరు? ఆడపిల్లలు ఎప్పుడూ ఎక్కడా కూడా మగవారి డ్రెస్సింగ్ గురించి మాట్లాడలేదే. ఎప్పుడండీ మీరు మారతారు? బూజుపట్టిపోయిన సంప్రదాయాలను పట్టుకుని వేళ్లాడుతున్నారు" అంటూ తన అసహనాన్ని ప్రదర్శించారు. అయితే, నాగబాబు ప్రత్యేకంగా ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది చర్చనీయాంశం అవుతోంది.