BJP: నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు!

  • నాగపూర్ లో ఏబీవీపీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం 
  • ఇంటిని చూసుకోలేనివాళ్లు దేశాన్ని ఏం కాపాడతారు?
  • గడ్కరీ వ్యాఖ్యలపై రాజకీయంగా ఆసక్తికర చర్చ
ప్రజా జీవితంలో ఓటమిని, వైఫల్యాలను అంగీకరించాలంటూ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజులకే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, మరోమారు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

నాగపూర్ లో ఏబీవీపీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాలా మంది కార్యకర్తలు ముందుగా తమ ఇంటిని, ఇల్లాలిని, పిల్లలను చూసుకోలేనివాళ్లు దేశాన్ని ఏం కాపాడతారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించే గడ్కరీ చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
BJP
Nitin gadkari
modi
nagapur
abvp

More Telugu News