YSRCP: నాపై దాడి చేసేందుకు యత్నించిన వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి

  • ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా
  • ‘పసుపు-కుంకుమ’ ప్రభుత్వ కార్యక్రమం
  • ఇదేమీ ‘జన్మభూమి’ కాదు

నిన్న చంద్రగిరి మండలంలో నిర్వహించిన ‘పసుపు-కుంకుమ’ కార్యక్రమంలో వైసీసీ-టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో వైసీసీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పృహ తప్పి పడిపోవడం, రుయా ఆసుపత్రికి తరలించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడారు. తనపై దాడి చేసేందుకు యత్నించిన వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

‘పసుపు-కుంకుమ’ ప్రభుత్వ కార్యక్రమం కనుకే తాను వెళ్లానని, ఇదేమీ ‘జన్మభూమి’ కార్యక్రమం కాదని విమర్శించారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడ్డాక తాను ఏనాడూ గొడవలను ప్రోత్సహించలేదని, కానీ, టీడీపీ నేతలు మాత్రం దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను పుట్టి పెరిగింది, చదివింది, పదవులు పొందింది చంద్రగిరి నియోజకవర్గంలోనేనని, అందుకే, ఈ నియోజకవర్గంలో ఎన్ని గొడవలు ఉన్నా సర్ది చెప్పానని అన్నారు. కానీ, ఈరోజు ఈ నియోజకవర్గంలో దాడులు జరుగుతున్నాయని, గొడవలతో ప్రజలు నిత్యం ఆందోళనకు గురవుతున్నారని ఆరోపించారు. ఈ విష సంస్కృతిని ఎలా అరికట్టాలో తనకు అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News