Vijay Mallya: ఇప్పటివరకూ అప్పీలుకే వెళ్లలేదు... ఇప్పుడు వెళ్తా: విజయ్ మాల్యా

  • గత డిసెంబర్ లోనే తీర్పు
  • అప్పీలు అవకాశాన్ని వాడుకోలేదు
  • ఇప్పుడు అప్పీలు చేస్తానన్న మాల్యా
తనను భారత్ కు అప్పగించాలని బ్రిటన్ హోమ్ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంపై యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ మాల్యా స్పందించారు. ఈ కేసులో గత సంవత్సరం డిసెంబర్ 10నే వెస్ట్ మినిస్టర్స్ కోర్టు న్యాయమూర్తి తీర్పిచ్చారని, ఆ వెంటనే తనకు అప్పీలు చేసుకునే అవకాశం లభించినా, తాను దాన్ని వాడుకోలేదని అన్నారు.

హోం శాఖ కార్యదర్శి నిర్ణయం ఇప్పుడు వెలువడిందని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు అప్పీలు ప్రక్రియను ప్రారంభించనున్నానని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కాగా, ఇండియాలో బ్యాంకులకు రూ. 9 వేల కోట్లను ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యాను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని ఈడీ, సీబీఐ వంటి సంస్థలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.




Vijay Mallya
London
Extradition
Fugitive

More Telugu News