sensex: స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- స్తబ్ధుగా కొనసాగిన దేశీయ మార్కెట్లు
- 34 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 22 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
అంతర్జాతీయ మార్కెట్లు మంచి లాభాల్లో ట్రేడ్ అవుతున్నా... దేశీయ మార్కెట్లు మాత్రం జోష్ లో కొనసాగలేదు. దీంతో మన మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈ నాటి ట్రేడింగ్ లో ఆటోమొబైల్స్ సూచీలు అత్యధికంగా లాభపడగా... బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ, హీరో మోటో కార్ప్ తదితర సంస్థల షేర్లు లాభాలు ఆర్జించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 34 పాయింట్ల లాభంతో 36,617 కు పెరిగింది. నిఫ్టీ 22 పాయింట్లు లాభపడి 10,934 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో హీరో మోటోకార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, మారుతి సుజుకీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. టాటా మోటార్స్, కోల్ ఇండియా, టాటా స్టీల్, యస్ బ్యాంక్, సన్ ఫార్మాలు టాప్ లూజర్లుగా నిలిచాయి.