KA PAUL: అప్పట్లో వైఎస్ నన్ను అడ్డుకోవడానికి 3 లక్షల మందిని పంపారు.. త్వరలోనే నా బయోపిక్ రాబోతోంది!: కేఏ పాల్

  • భీమవరంలో నాపై దాడి జరిగింది
  • కోరగానే తెలంగాణ పోలీసులు సెక్యూరిటీ పంపారు
  • మీడియాతో మాట్లాడిన ప్రజాశాంతి పార్టీ చీఫ్

భీమవరం పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్త ఒకరు తనపై దాడి చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మత ప్రచారకుడు కేఏ పాల్ ఆరోపించారు. అతడిని ఏపీ పోలీసులు తీసుకెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం తనకు రక్షణ కల్పించడం లేదని మండిపడ్డారు. మరోవైపు తాను కోరగానే తెలంగాణ ప్రభుత్వం పోలీసులను భద్రతగా పంపిందని ప్రశంసించారు. గాడ్ బ్లెస్ తెలంగాణ ప్రభుత్వం, గాడ్ బ్లెస్ పోలీసులు అని ఆశీర్వదించారు.

తన భద్రత గురించి ఎనాడూ భయపడలేదని కేఏ పాల్ స్పష్టం చేశారు. 2008, సెప్టెంబర్ 25న తన కైకలూరు టూర్ ను అడ్డుకోవడానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 3,00,000 మందిని పంపారని ఆరోపించారు. అయినా తాను వెనక్కు తగ్గలేదనీ, 17 కార్ల కాన్వాయ్ ను వదిలేసి క్యాప్ పెట్టుకుని బైక్ ఎక్కి ముందుకు వెళ్లానని పేర్కొన్నారు. ఈ ఘటనను అప్పట్లో చాలా ఛానల్స్ లైవ్ గా ప్రసారం చేశాయన్నారు. త్వరలోనే తన బయోపిక్ రాబోతోందని స్పష్టం చేశారు. ప్రజలంతా నూటికి నూరు శాతం ప్రజాశాంతి పార్టీకే ఓటు వేయాలని కోరారు.

  • Loading...

More Telugu News