robert vadra: మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాను విచారిస్తుండటంపై మమత బెనర్జీ స్పందన
- ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది
- వాద్రా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- అందరికీ పంపినట్టే ఆయనకు కూడా నోటీసులు పంపారు
మనీ లాండరింగ్ కేసులో ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రాను అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించాల్సిందిగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని మీడియా కోరగా... త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆమె అన్నారు. రాబర్ట్ వాద్రా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... అందరికీ పంపినట్టే ఆయనకు కూడా నోటీసులు పంపారని... విచారణకు ఆయన హాజరయ్యారని చెప్పారు. కేంద్రాన్ని ఎదుర్కోనే విషయంలో విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైనే ఉంటాయని అన్నారు.
యూకేలో ఆస్తులను కొన్న అంశానికి సంబంధించి రాబర్ట్ వాద్రా విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ, అసమంజసమైన, అన్యాయమైన, హానికరమైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ ను తాను ఎదుర్కొంటున్నానని చెప్పారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తనపై ఇదంతా జరుగుతోందని విమర్శించారు.