sweeper: స్వీపర్ పోస్టుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తు చేసిన ఇంజినీరింగ్, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు
- తమిళనాడు అసెంబ్లీలో స్వీపర్ పోస్టులకు ప్రకటన
- నెలసరి వేతనం రూ. 17,000
- దరఖాస్తు చేసిన ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, పీజీ, డిగ్రీ విద్యావంతులు
స్వీపర్ పోస్టుల కోసం వేలాది మంది ఇంజినీరింగ్, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, తమిళనాడు అసెంబ్లీలో 14 స్వీపర్ పోస్టుల కోసం ప్రకటన వెలువడింది. ఈ ఉద్యోగాల కోసం ఏకంగా 4,600 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 150 మంది ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, డిగ్రీ, పీజీలు చేసినవారు ఉన్నారు. వీటిలో అసంపూర్ణంగా ఉన్న 677 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. వాస్తవానికి ఈ ఉద్యోగాలకు ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు ఇది అద్దంపడుతోందని ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. నెలసరి వేతనం రూ. 17వేలు ఉండటం వల్లే ఉన్నత విద్య చదివిన వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేశారని అధికార అన్నాడీఎంకే స్పందించింది.