sensex: లాభాల స్వీకరణ.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
- ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు
- ఆర్బీఐ సమీక్ష ప్రకటన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ చేసిన ఇన్వెస్టర్లు
- 4 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ఈరోజు దేశీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ఉత్సాహంగా ప్రారంభమైనప్పటికీ... ఆర్బీఐ సమీక్ష ప్రకటన అనంతరం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో, ఉదయం నుంచి వచ్చిన లాభాలను కోల్పోయిన మార్కెట్లు చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 4 పాయింట్లు కోల్పోయి 36,971కి పడిపోయింది. నిఫ్టీ 9 పాయింట్లు లాభపడి 11,069కి పెరిగింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో సన్ ఫార్మా, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, హీరో మోటో కార్ప్, కోల్ ఇండియా తదితర కంపెనీలు లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్ తదితర కంపెనీలు నష్టపోయాయి.