Mamatha Benarji: మమత ధర్నాలో పాల్గొన్న పోలీసు అధికారులపై కేంద్రం సీరియస్
- ధర్నాలో పాల్గొన్న ఐపీఎస్ అధికారులు
- కేంద్ర ప్రభుత్వంలో పని చేయకుండా నిషేధించే అవకాశం
- పోలీసు పతకాలను వెనక్కి తీసుకోవాలని యోచన
శారదా స్కామ్ కేసు విచారణకు సంబంధించి కోల్ కతా పోలీస్ కమీషనర్ పట్ల సీబీఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ధర్నాలో కొందరు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. దీనిపై కేంద్రం సీరియస్ అయ్యింది. దీక్షలో పాల్గొన్న పోలీసు అధికారులపై చర్య తీసుకోవాలని కేంద్ర హోంశాఖ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ అధికారులపై కేంద్ర ప్రభుత్వంలో పని చేయకుండా నిషేధం విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వారి పోలీసు పతకాలను వెనక్కి తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది.