Telangana: చల్లా ధర్మారెడ్డికి మంత్రి పదవి ఇవ్వండి.. హైకమాండ్ కు టీఆర్ఎస్ నేతల విజ్ఞప్తి!

  • రెండోసారి భారీ మెజారిటీతో గెలిచారు
  • ధర్మారెడ్డికి మంత్రి పదవి ఇస్తే జిల్లాలో అభివృద్ధి
  • లేదంటే పార్టీనే అంతిమంగా నష్టపోతుంది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ లో మంత్రి పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని వరంగల్ రూరల్ టీఆర్ఎస్ నేతలు పార్టీ హైకమాండ్ ను కోరారు. ధర్మారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి రెండోసారి భారీ మెజారిటీతో గెలుపొందారని గుర్తుచేశారు.

చల్లా ధర్మారెడ్డికి మంత్రి పదవి ఇస్తే వరంగల్ రూరల్ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ధర్మారెడ్డికి కేబినెట్ లో చోటు దక్కకుంటే టీఆర్ఎస్ పార్టీనే నష్టపోతుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు సాహురే రాజేశ్వర్‌రావు, రాయరాకుల రవీందర్‌, నాగనబోయిన సాంబయ్య, బొల్లోజు కుమారస్వామి, చెంచు ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
Telangana
parakala
challa
dharmareddy
TRS
cabinet
minister
high command

More Telugu News