election commission: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలపై దృష్టిసారించిన కేంద్ర ఎన్నికల సంఘం
- రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై దృష్టి
- 11, 12వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న సంఘం సభ్యులు
- రాజకీయ పార్టీలతో భేటీకి అవకాశం
త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసారి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది. రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలతోపాటు వివిధ సంఘాల ప్రతినిధులతో సమీక్షా సమావేశాలు నిర్వహణకు అవసరమైన కసరత్తు చేపట్టింది.
ఇందుకోసం ఈ నెల 11, 12వ తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం జిల్లాలో పర్యటించనుంది. ఓటర్ల జాబితాలో అక్రమాలు, దొంగ ఓట్ల నమోదు, ఈవీఎంల వంటి అంశాలపై చర్చించేందుకు ఈనెల 11వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. అదే రోజు కలెక్టర్లు, ఎస్పీలతో కూడా సమావేశం కానుంది. 12వ తేదీన మద్యనియంత్రణ, డబ్బుపంపిణీకి అడ్డుకట్ట వేయడం, శాంతిభద్రతల అంశాలపై ఆయా విభాగాధిపతులతోపాటు ఇతర ముఖ్యమైన విభాగాలతోనూ సమావేశమై ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.