vijayawada-guntur railway line: విజయవాడ-గుంటూరు కొత్త రైల్వేలైన్కు కేంద్రం రెడ్ సిగ్నల్
- గత ఏడాది వార్షిక బడ్జెట్లో ప్రతిపాదన
- దీనిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వని కేంద్రం
- లోక్సభలో ఎంపీ కనకమేడల ప్రశ్నించడంతో సాధ్యం కాదని వెల్లడి
2017-18 ఆర్థిక సంవత్సరం కేంద్ర వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించిన విజయవాడ-గుంటూరు కొత్త రైల్వేలైనుకు కేంద్రం రెడ్ సిగ్నల్ వేసింది. ఈ రైల్వే లైనును ప్రతిపాదించి దాదాపు ఏడాది గడిచిపోయినా ఇప్పటి వరకు ఉలుకూపలుకూ లేని కేంద్రం ఎట్టకేలకు బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సాధ్యం కాదని చెప్పేసింది. నవ్యాంధ్ర కొత్తరాజధాని అమరావతిని అనుసంధానిస్తూ ఈ రైల్వేలైనుకు గతంలో ప్రతిపాదించారు. నీతి అయోగ్ సిఫార్సు అంటూ ప్రతిపాదించిన పనులను ఆమోదించేందుకు అంగీకరించడం లేదు. ఉపరితల రవాణాశాఖ, పట్టణాభివృద్ధి శాఖల మధ్య సంప్రదింపుల ప్రక్రియ ఇంకా పూర్తికానందున ఈ ప్రతిపాదన ముందుకు సాగే అవకాశం ఇప్పట్లో లేదని మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.