dhruv: తమిళ 'అర్జున్ రెడ్డి' ఆగిపోవడానికి కారకుడు విక్రమ్?
- ధృవ్ హీరోగా 'వర్మ'
- దర్శకుడిగా బాల
- పక్కన పెట్టేయమన్న విక్రమ్
తెలుగులో వచ్చిన 'అర్జున్ రెడ్డి' యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా వివిధ భాషల్లో రీమేక్ అవుతోంది. తమిళంలో 'వర్మ' పేరుతో ఈ సినిమాను దర్శకుడు బాల రూపొందించాడు. హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ఈ సినిమాలో హీరోగా చేశాడు .. ఈ కుర్రాడికి ఇదే ఫస్టు మూవీ. ఇటీవలే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా అవుట్ పుట్ తమకి నచ్చలేదనీ, అందువలన దానిని పక్కన పెట్టేస్తున్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. ధృవ్ హీరోగా వేరే దర్శకుడితో ఈ సినిమాను నిర్మించనున్నట్టు చెప్పారు. అయితే ఈ సినిమా ఆగిపోవడానికి కారకుడు విక్రమ్ అనే మాట కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. అవుట్ పుట్ విక్రమ్ కి ఎంత మాత్రం నచ్చలేదట. ఈ సినిమా విడుదలైతే .. తన కొడుకు కెరియర్ ఇబ్బందుల్లో పడుతుందని భావించి ఆపేయమన్నాడట. ఎంత ఖర్చైనా ఫరవాలేదనే సంకేతాలు ఇవ్వడం వల్లనే నిర్మాతల నుంచి ఈ ప్రకటన వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.