mamata banerjee: మమతా బెనర్జీ 'ఝాన్సీ రాణి' కాదు.. ఓ రాక్షసి: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
- మమతా బెనర్జీ ఓ పూతన
- వ్యతిరేకంగా మాట్లాడితే ప్రతాపం చూపడం తగదు
- ప్రజాస్వామ్యానికి ఆస్కారం లేని ఏకైక రాష్ట్రం ఇది
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మమతను ఝాన్సీరాణిగా అభివర్ణించడాన్ని ఆయన తప్పుబట్టారు. రోహింగ్యాలు, అక్రమ వలసదారులకు మద్దతిచ్చిన మమతను ఝాన్సీరాణితో పోల్చడం తగదని, ఆ పోలికకు ఆమె ఏమాత్రం సరిపోదని దుయ్యబట్టారు.
మమత బెనర్జీ ఓ పూతన (రాక్షసి) అని, ఝాన్సీ రాణి ఎంతమాత్రం కాదని అన్నారు. అంతేకాకుండా, పశ్చిమ బెంగాల్ ని ఆమె నాశనం చేస్తున్నారని, ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ కార్యకర్తలపై తన ప్రతాపం చూపిస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ఆస్కారం లేని ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని, ఈ సందర్భంగా మమతను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తో ఆయన మరోసారి పోల్చడం గమనార్హం.