Petrol: క్రూడాయిల్ ధర తగ్గినా... స్వల్పంగా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధర!

  • లీటర్ పెట్రోలుపై 5 పైసల ధర పెంపు
  • 6 పైసల మేరకు పెరిగిన డీజిల్ ధర
  • హైదరాబాద్ లో పెట్రోలు రూ. 74.62

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ, దేశంలోని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నేడు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచాయి. సోమవారం నాడు లీటరు పెట్రోల్ పై 5 పైసలు , డీజిల్ పై 6 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ఐఓసీఎల్ ప్రకటించింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 70.33కు చేరగా, డీజిల్ ధర రూ. 65.62కు పెరిగింది. వాణిజ్య రాజధాని  లీటరు పెట్రోల్ ధర రూ. 75.97కు, డీజిల్ ధర రూ. 68.71కి చేరింది.

ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలను పరిశీలిస్తే, కోల్‌కతాలో పెట్రోలు ధర రూ. 72.44కు, డీజిల్‌ ధర రూ. 67.40కు చేరగా, చెన్నైలో పెట్రోలు ధర రూ. 73.00కు, డీజిల్‌ ధర రూ. 69.32కు పెరిగింది. ఇదే సమయంలో బెంగళూరులో పెట్రోలు రూ. 72.65, డీజిల్‌ రూ. 67.78కు చేరగా, హైదరాబాద్ లో పెట్రోలు ధర లీటర్‌ రూ. 74.62 డీజిల్‌ ధర రూ.71.34కు పెరిగింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌‌ కు 61.67 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 52.17 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News