Chandrababu: వైఎస్ఆర్ కాంగ్రెస్ తో చెలిమిపై మరోసారి స్పందించిన చంద్రబాబునాయుడు!
- నిన్న జాతీయ మీడియాతో చెలిమి వ్యాఖ్యలు
- నేడు తెలుగు మీడియా ముందు స్పందన
- వచ్చినప్పుడు చూద్దామని వ్యాఖ్య
- ముందు మద్దతివ్వనివ్వండన్న చంద్రబాబు
రెండో మూడో ఎంపీ సీట్లను గెలుచుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తమకు మద్దతిచ్చేందుకు ముందుకు వస్తే అప్పుడు చూద్దామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి వ్యాఖ్యానించారు. సోమవారం నాడు న్యూఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ధర్మపోరాట దీక్షకు దిగిన వేళ, ఎన్నికల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసివస్తే, తాము ఆహ్వానించి, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కలిసి పోరాడతామని జాతీయ మీడియాతో సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. నేడు జంతర్ మంతర్ నుంచి రాష్ట్రపతి భవన్ కు పాదయాత్రగా కదిలిన చంద్రబాబును ఇదే విషయమై తెలుగు మీడియా ప్రశ్నించింది.
"వాళ్లు ఓడిపోయామని ఒప్పుకొని, మళ్లా వాళ్లు ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తే, వాళ్ల కేసుల మీద రాజీకి కాదు. వాళ్లు నమ్మకంతో, ఓ సిద్ధాంతంతో వస్తే... ఈ రోజు బీజేపీతో కలిశారు. బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. ప్రజలు చీకొట్టే పరిస్థితికి వచ్చారు. నిన్న ఒక మీడియా అడిగింది. ఒకవేళ రెండు, మూడు సీట్లు వచ్చి, చేసిన తప్పు ఒప్పుకోని, ఆయన వస్తే ఏం చేస్తారని అంటే... లెట్ హిమ్ సపోర్ట్ అన్నాను. ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. ఐయామ్ నాట్ వెల్కమింగ్ హిమ్. హూ విల్ టేక్ దట్ కరప్టెడ్ పీపుల్... దట్స్ డిఫరెంట్ ఇష్యూ" అని వ్యాఖ్యానించారు.