rafel: ‘రాఫెల్’ డీల్ లో ‘కాగ్’ పాత్ర ఉందనడం అబద్ధం: రాహుల్ పై అరుణ్ జైట్లీ ఫైర్

  • మునిగిపోతున్న రాజ వంశం ’కాంగ్రెస్’
  • కాపాడుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడతారు!
  • రాఫెల్ ఒప్పందంపై రోజువారీ అబద్ధాలు తగదు

రాఫెల్ డీల్ లో కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పాత్ర ఉందంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఘాటు కౌంటరిచ్చారు. ఈ ఒప్పందం విషయమై కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ఈ ఒప్పందంలో ఎలాంటి స్వలాభాలకు చోటులేదని మరోసారి స్పష్టం చేశారు. మునిగిపోతున్న రాజ వంశాన్ని కాపాడుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడతారంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.

 రాఫెల్ ఒప్పందం ద్వారా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎన్డీయే ప్రభుత్వం ఆదా చేసిందని, ఈ ఒప్పందంపై రోజు వారి ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ కొత్త అబద్ధాలను సృష్టిస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే రాఫెల్ ఒప్పందంలో కాగ్ పాత్ర ఉందన్న అబద్ధాన్ని సృష్టించిందని దుయ్యబట్టారు. రాఫెల్ ఒప్పందంపై దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు తిరస్కరించిన సందర్భంలో కూడా ఆ రాజవంశీకుడు, ఆయన మిత్రులు విమర్శలు చేశారంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, సీసీఎస్, కాంట్రాక్టు నెగోషియేషన్ కమిటీలు లేవని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.


  • Loading...

More Telugu News