Bala Murugan: ఫుడ్ కోసం ఆన్‌లైన్ లో ఆర్డర్ చేస్తే.. కస్టమర్ కి ఝలక్!

  • నూడిల్స్ ఆర్డర్ చేసిన బాల మురుగన్
  • కస్టమర్‌ కేర్‌కు ఫోన్ చేస్తే స్పందన కరవు
  • రెస్టారెంట్‌కు ఫోన్ చేస్తే నిర్లక్ష్యపు సమాధానం

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు తమ నిర్లక్ష్యం కారణంగా ఇటీవల తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. తాజాగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వార్తల్లో నిలిచింది. స్విగ్గీ ద్వారా ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాడు. తీరా పార్శిల్ వచ్చాక చూస్తే అందులో రక్తంతో తడిసిన ఓ బ్యాండేజ్ కనిపించడంతో అతను షాక్ అయ్యాడు.

వివరాల్లోకి వెళితే, చెన్నైలోని సెలైయూర్‌కు చెందిన బాల మురుగన్ ఆదివారం స్విగ్గీ ద్వారా ‘చాప్ ఎన్ స్టిక్’ అనే రెస్టారెంట్ నుంచి నూడిల్స్ ఆర్డర్ చేశాడు. పార్శిల్ విప్పి సగం తిన్నాక అందులో రక్తంతో తడిసిన బ్యాండేజ్‌ను చూసి షాక్ అయ్యాడు. వెంటనే స్విగ్గీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసినా వారు స్పందించలేదని బాలమురుగన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం రెస్టారెంట్‌కు ఫోన్ చేసినా నిర్లక్ష్యంగా సమాధానం వచ్చిందని బాల మురుగున్ ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు.

  • Loading...

More Telugu News